హైదరాబాద్ : దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ అని ప్రపంచ దేశాలు, వైద్యులు భయపడుతున్న వేళ ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా ఉన్నా సరే వచ్చే ఏడాది కుంభమేళా మాత్రం తప్పకుండా జరపుతామని తేల్చి చెప్పారు. అయితే కుంభమేళాను ఎంత భారీగా నిర్వహిస్తామనేది మాత్రం కరోనా తీవ్రతపై ఆధారపడి ఉంటుందన్నారు. అంతేగానీ కుంభమేళాను ఆపడం మాత్రం నిలిపివేసేది లేదని అన్నారు. కుంభమేళా గనుక నిర్వహిస్తే ప్రతిరోజూ కనీసం 35-50 లక్షల మంది గంగానదిలో స్నానాలు చేస్తారని మంత్రి మదన్ కౌశిక్ వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm