హైదరాబాద్ : కరోనా కారణంగా దేశంలో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, వీఐపీలు, సాధారణ పౌరులు మృత్యువాతపడ్డారు. కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. తాజాగా ఒడిశా గవర్నర్ గణేశీ లాల్ భార్య సుశీలా దేవి కరోనాతో మృతి చెందారు. వైరస్‌తో కొంతకాలంగా బాధపడుతున్న సుశీలా దేవి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కాగా ప్రస్తుతం గవర్నర్‌తోపాటు మరో నలుగురు కుటుంబ సభ్యులు కరోనాకు చికిత్స పొందుతున్నారు. సుశీలా దేవీ మృతి విషయం తెలుసుకున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గవర్నర్ గణేశీ లాల్, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన నవీన్ పట్నాయక్ ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
Mon Jan 19, 2015 06:51 pm