హైదరాబాద్: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు పలు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలు రెండు రోజుల్లోగా కరోనా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. వైరస్ నియంత్రణ కోసం తీసుకున్న చర్యలను వివరించాలని కోర్టు ఆయా రాష్ట్రాలను కోరింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం కరోనా కేసులపై విచారణ చేపట్టింది. డిసెంబర్ నెలలో పరిస్థితి మరింత భయానకంగా ఉండే అవకాశాలు ఉన్నాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా కేసుల విషయంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ రిపోర్ట్ కావాలని, ఒకవేళ రాష్ట్రాలు సంసిద్ధంగా లేకుంటే, అప్పుడు డిసెంబర్‌లో పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని కోర్టు అభిప్రాయపడింది. గుజరాత్, ఢిల్లీలో భారీగా కేసులు పెరుగుతున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలను ప్రత్యేకంగా హెచ్చరించింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 Nov,2020 12:16PM